భీమవరం నుంచి పవన్ కు పోటీగా వర్మ..

249
Pawan kalyan Rgv
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే కావాల్సినంత ప్రమోషన్స్ చేసేశాడు వర్మ. తాజాగా మరో ట్వీట్ చేసి అందరికి ఆశ్చర్యానికి గురిచేశాడు. తాను ఈఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు చెప్పారు వర్మ. . నామినేషన్లకు గడువు ముగిసినా, తనకు ఉన్నతాధికారుల నుంచి పోటీ చేసేందుకు అనుమతి లభించిందని చెప్పారు.

అంతేకాకుండా మరిన్ని విషయాల కోసం వేచి చూడండి అని ట్వీట్ చేశాడు వర్మ. ఇప్పడు ఈ ట్వీట్ లు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. కొద్ది సేపటి తర్వాత మరో ట్వీట్ చేస్తూ ఇది కేవలం అడ్వాన్స్ ఎప్రిల్ ఎప్రిల్ పూల్ జోక్ అని నాకు తెలిసి దీన్ని ఎవ్వరూ నమ్మి ఉండరని చెప్పారు. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నో వివాదాల మధ్య రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్ర విడుదల తర్వాత మరెన్ని వివాదాలు తలెత్తుతాయో చూడాలి.

- Advertisement -