దేశంలో అత్యుత్తమ సీఎం కేసీఆర్‌-చిన్నికృష్ణ

245
chinni krishna
- Advertisement -

ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీకి సూపర్‌ హిట్ కథలను అందించిన ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ, పవన్‌ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రా ప్రజల బంధం 70ఏళ్లుగా బలపడింది. మేమంతా ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నామని మీడియా సమావేశంలో చిన్నికృష్ణ పేర్కొన్నారు.

కాపులంటే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని, తాము కూడా కాపులమేనని, ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కల్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాలని చిన్నికృష్ణ అన్నారు. తాను కూడా కాపు బిడ్డనేనని, హైదరాబాద్‌లో తమపై ఎవరైనా దాడి చేస్తే, పవన్ వచ్చి రక్షిస్తారా? ఆయన అన్న నాగబాబు వచ్చి రక్షిస్తారా? అని ప్రశ్నించారు.

KCR

భారతదేశంలో అత్యుత్తమమైన సీఎం.. కేసీఆర్‌. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో సంతోషంగా ఉన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌ చెప్పినట్లుగానే ఆంధ్రా ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విడదీయకండి. కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని చెప్పింది పవన్‌కు కాదు.

రాజకీయాల పేరుతో తెలుగు రాష్ర్టాలను విడదీయవద్దు. తెలంగాణలో నివసిస్తున్న ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. అని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, కాబోయే సీఎం జగనేనని అంచనా వేసిన చిన్నికృష్ణ, జగన్ ఒక్కడిని చేసి, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేనలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -