వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా కె.గోవర్ధన్‌రావు దర్శకత్వంలో హేమలతా రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం నిన్నే చూస్తూ. ఈ చిత్రంలో నాటితరం హీరో హీరోయిన్లు సుహాసిని, సుమన్, భాను చందర్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇటీవల వైజాగ్ పరిసరప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకొన్న ఈ చిత్రం సెన్సార్ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది.
నిన్ను చూస్తూ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దాదాపు సినిమా పనులు పూర్తికావొస్తుండటంతో చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో నిర్మాత హేమలతారెడ్డి టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ “నిన్నే చూస్తూ సినిమా ఒక్క అందమైన ప్రేమకథ చిత్రం. మానవ విలువలతో మనసుకు హత్తుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించిన చిత్రం. మా సినిమా త్వరలోనే సెన్సార్‌కు వెళ్లబోతున్నది. అన్ని పనులు పూర్తి చేసుకొన్న తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేస్తాం అని అన్నారు.