- Advertisement -
అమీర్పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలును ప్రారంభించారు గవర్నర్ నరసింహన్. అమీర్ పేట్ స్టేషన్ లో జెండా ఉపి ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
మొత్తం 10కి.మీ మార్గంలో అమీర్పేట్తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్ స్టేషన్కు తరుణి మెట్రో స్టేషన్గా నామకరణం చేశారు. పూర్తయిన రెండు కారిడార్లతో కలిపి మొత్తం 56కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ నాయకులు ఏవరూ ఈకార్యక్రమంలో పాల్గోనలేదు.
- Advertisement -