భువనగిరి ఎంపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి పేరు ఖరారు..

328
Komatireddy Venkat Reddy
- Advertisement -

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోసం తీవ్ర కసరత్తులు చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ అధిస్టానం. అందుకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సినీయర్లను నిలబె ట్టాలని చూస్తోంది . గత రాత్రి 8మంది అధ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగతా 9స్ధానాల అభ్యర్ధులను ఇవాళ రాత్రి విడుదల చేయనున్నట్లు తెలిపారు ఏఐసిసి కార్యదర్శి ఆర్.సీ కుంతియా. ఇక తాజాగా మరో వ్యక్తి పేరు కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మొదట ఈస్ధానం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పోటీ చేయాలని అనుకున్నా..కోమటిరెడ్డి రావడంతో ఆయన సైడ్ అయిపోయారని తెలుస్తుంది.

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డికి కొంచెం పట్టుఉండటంతో ఆధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపింది. భువనగిరి లోక్‌సభ పరిధిలో భువనగిరితోపాటు మునుగోడు, ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. తుంగతుర్తిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు నకిరేకల్ ఎమ్మెల్యే   చిరుమర్తి లింగయ్య ఇటివలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక నల్గొండ పార్లమెంట్ స్ధానం నుంచి సీనియర్ నాయకులు జానారెడ్డి పేరు వినిపిస్తుంది.

- Advertisement -