బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది యాంకర్ రష్మీ. అటు బుల్లి తెరపై యాంకరింగ్ తో పాటు ఇటు వెండీ తెరపై కూడా హీరోయిన్ గా అలరిస్తుంది. తన అందం, నటనతో కుర్రకారు మతిపొగేట్టుస్తుంది రష్మీ. ఇక రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో అంశంపై ఆమె స్పందిస్తూనే ఉంటుంది. తనకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఎవరయినా వల్గర్ గా కామెంట్ చేస్తే రష్మీ కూడా అదే రేంజ్ లో రిప్లే ఇస్తుంది. ఇక సెలబ్రెటీలన్నాక వల్గర్ కామెంట్స్ తో పాటు వేధింపులు కూడా ఉంటాయి. వీటిని పెద్దగా పట్టించుకోని రష్మి.. హద్దులు దాటితే మాత్రం ఆన్ లైన్‌లోనే లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పేకేస్తుంది.
తాజాగా ఓ వ్యక్తి రష్మీ ఫోన్ నెంబర్ కోసం ట్రై చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వ్యక్తి చేసిన ట్వీట్ ను రష్మీ ఇప్పుడు బహిర్గతం చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ట్వీట్టర్ ద్వారా తన అభిమానులతో ముచ్చటిస్తున్న రష్మీకి ఓ మెసెజ్ వచ్చింది. హేయ్.. రష్మి.. ఓ యాడ్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నా.. మీ ఫాదర్ నంబర్ మిస్ అయ్యింది. ఏం అనుకోకుండా మీ ఫాదర్ నెంబర్ సెండ్ చేస్తారా’అని మెసెజ్ చేశాడు.
ఈసందర్భంగా ఆ ట్వీట్ చూసిన రష్మీ ఆయనకు ఈవిధంగా రిప్లే ఇచ్చింది. నాకు పన్నెండేళ్లప్పుడే మా నాన్న చనిపోయారు. ఆయన నెంబర్ నీ దగ్గర ఎలా ఉంటుంది. ఇలాంటి చిల్లర ట్రిక్స్ ప్లే చేయకు. ఇక్కడ ఫూల్ అయ్యేందుకు ఎవరూ రెడీగా లేరు. పీఆర్ మేనేజ్‌మెంట్ అంటూ అమ్మాయిలతో మాట్లాడటానికి ఇదో కొత్త మార్గం అని నాకు తెలుసు. ఇలాంటి వాళ్ల వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని ట్వీట్ చేసింది. దీంతో రష్మీ కౌంటర్ చూసిన ఆవ్యక్తి వెంటనే తన మెసెజ్ ను డిలిట్ చేసేశాడు. కొంత మంది చెడ్డ వారి వల్ల అందరికి బ్యాడ్ నేమ్ వస్తుందన్నారు రష్మీ.