మొహాలీ వన్డే.. భారత్ భారీ స్కోర్‌ 358/9

247
India vs Australia
- Advertisement -

మొహాలీలో ఆసీస్‌తో నాల్గో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు రోహిత్‌-ధావన్‌లు శుభారంభం అందించారు. ఒకవైపు ధావన్‌ ధాటిగా బ్యాటింగ్‌ కొనసాగిస్తే, రోహిత్‌ మాత్రం కుదురుగా ఆడాడు. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.

India vs Australia

తద్వారా ఆసీస్ కు 359 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ధావన్ 143 (115 బంతులు) పరుగులు చేయగా… మరో ఓపెనర్ రోహిత్ శర్మ 95 (92 బంతులు) పరుగుల వద్ద ఔట్ అయి, సెంచరీనీ తృటిలో కోల్పోయాడు. వీరిద్దరూ 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం కోహ్లీ 7, పంత్ 36, జాధవ్ 10, విజయ్ శంకర్ 26, భువనేశ్వర్ కుమార్ 1, చాహల్ 0 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ 1, బుమ్రా 6 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఎదుర్కొన్న బుమ్రా… ఆ బంతిని సిక్సర్ గా మలిచాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లను పడగొట్టగా రిచర్డ్ సన్ 3, జంపా ఒక వికెట్ తీశారు.

- Advertisement -