విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న లేడి సూపర్ స్టార్

287
vijay devarakonda nayanatara
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటివలే ట్యాక్సివాలా సినిమాతో విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన డియర్ కామ్రేడ్ మూవీలో బిజీగా ఉన్నాడు. ఈచిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. ఈసినిమాలో విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఎప్రిల్ లో ఈమూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. డియర్ కామ్రేడ్ మూవీతో పాటు దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఓ సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు.

vijay devarakonda nayanatara

ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విజయ్‌, ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు. తాజాగా తమిళ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించనుందన్న వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తెలుగు లో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ తమిళ్ లో కూడా తన సత్తా చూపించుకునేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడునుంది.

- Advertisement -