టీఆర్ఎస్ లో చేరికపై క్లారీటి ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర

261
sandra venkata veraiah
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు సండ్ర. త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరతానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ది, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలతో చర్చించి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరతానని చెప్పారు.

ఇవాళ అసెంబ్లీలో జరిగిన టీడీఎల్పి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కొల్పోయిందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లా రైతుల కళ ను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజా సంక్షేమంగ కోసమే పనిచేస్తున్నానని తెలిపారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

- Advertisement -