టీఆర్ఎస్‌ సన్నాహాక సమావేశాల..షెడ్యూల్

295
ktr trs
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొలుత మార్చి 1 నుండి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఉగ్రదాడి,దేశవ్యాప్తంగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కేటీఆర్.

తాజాగా సన్నాహాక సమావేశాల షెడ్యూల్‌ని ఖరారు చేశారు కేటీఆర్. మార్చి 6 నుండి 17 వరకు 16 ఎంపీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మార్చి6న కరీంనగర్,మార్చి 7న వరంగల్,భువనగిరి,మార్చి 8న మెదక్,మల్కాజ్‌గిరి,మార్చి 9న నాగర్‌కర్నూలు,చేవెళ్ల,మార్చి 13న జహీరాబాద్,సికింద్రాబాద్,మార్చి 14న నిజామాబాద్,ఆదిలాబాద్,మార్చి 15న పెద్దపల్లి,మార్చి 16న మహబూబాబాద్,ఖమ్మం,మార్చి 17న నల్లగొండ,మహబూబ్ నగర్‌ నియోజకవర్గాల సమావేశం జరగనుంది.

ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 2 వేల మంది చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇలా లోక్‌సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి సగటున 14 వేల మందితో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా కేటీఆర్ ఖమ్మం,రామగుండంలో బసచేయనున్నారు. సన్నాహక సమావేశాలకు ముందు గానీ, తర్వాత గానీ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలతో సమావేశం కానున్నారు కేటీఆర్‌.

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సన్నా హక సమావేశం వనపర్తిలో, పెద్దపల్లి లోక్‌సభ సమావేశం రామగుండంలో, జహీరాబాద్‌ లోక్‌సభ సమా వేశం నిజాంసాగర్‌ ప్రాజెక్టు సమీపంలో నిర్వహించనున్నారు.

- Advertisement -