గోవాలో ఇస్మార్ట్ శంకర్…

264
ram ismart shankar
- Advertisement -

హీరో రామ్ – పూరి జగనాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. గోవాలో కీలకమైన షెడ్యూల్‌ చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘హలో గురూ ప్రేమ కోసమే’ అనే సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న హీరో రామ్,’మెహబూబా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన పూరి జగన్నాథ్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇద్దరికి కీలకం కానుంది.

రామ్‌ సరసన ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ ,‘నన్ను దోచుకొందువటే’ తో ఆకట్టుకున్న నభా నటేష్‌ను హీరోయిన్లుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -