హ్యాపీ బర్త్ డే..మహమూద్ అలీ

293
mahmood ali
- Advertisement -

సీఎం కేసీఆర్ అత్యంత ఆప్తులు,వీరవిధేయుల్లో టక్కున గుర్తొచ్చే పేరు మహమూద్ అలీ. డిప్యూటీ సీఎంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహమూద్ అలీ పుట్టినరోజు నేడు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమూద్ అలీ టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ వెంటే నడిచారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, టీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.  పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు అలీ. వీరజవాన్లకు నివాళిగా బర్త్ డే వేడుకలను జరపవద్దని పార్టీ కార్యకర్తలు,అనుచరులకు సూచించారు.

2013 నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో పాటు రెవెన్యూ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక మంత్రి మహమూద్ అలీకి సీఎం కేసీఆర్ అరుదైన గౌరవం ఇచ్చారు. ఆయనకు కీలకమైన హోం మంత్రిత్వ శాఖ కేటాయించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి ముస్లిం సామాజిక వర్గం నుండి హోంమంత్రిగా పనిచేసింది ఇద్దరే. చెన్నారెడ్డి హయాంలో ఎంఎం హష్మి ఏపీ తొలి ముస్లిం హోంమంత్రిగా పనిచేయగా 4 దశాబ్దాల తర్వాత స్వరాష్ట్రంలో అదే సామాజికవర్గానికి చెందిన హహమూద్ అలీ హోంమంత్రిగా నియమితులై రికార్డు సృష్టించారు. హష్మి, అలీ ఇద్దరూ పాతబస్తీ వారే కావడం విశేషం.

mahmood ali

- Advertisement -