కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన బ్యూటీ లక్ష్మి రాయ్.తెలుగుతో పాటు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించిన అదృష్టం మాత్రం వరించలేదు. దీంతో అందరు హీరోయిన్ల బాటలోనే తన గ్లామర్,క్లీవేజ్ షోలకు మరింత పదునుపెట్టింది.
ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు విభిన్నమైన కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తున్న రాయ్ లక్ష్మీ తనపై వస్తున్న రూమర్లను ఖండించింది.తాను ప్రెగ్నెంట్ అని ఓ తమిళ వెబ్ సైట్ రాసిన కథనంపై తీవ్ర స్ధాయిలో మండిపడింది. వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లు కథలు అల్లేస్తారా అంటూ ఫైరవుతూనే నన్ను సంప్రదిస్తే ఇంతకంటే మంచి కథలు ఇస్తాగా అంటూ చురకలు అంటించింది. ఈ వార్త రాసిన వ్యక్తికి నేనంటే అస్సలు ఇష్టం లేనట్టు ఉంది. అందుకే ఇలాంటి వార్తల్ని పుట్టిస్తున్నారు అని దుయ్యబట్టారు.
ప్రస్తుతం రాయ్ లక్ష్మీ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్‌తో అందాలను ఆరబోసి భారీ హైప్ తీసుకువచ్చింది. ఈ సినిమా హిట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న రత్తాలు తన కెరీర్‌ని మార్చే మూవీ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది.