నా జీవితాన్ని నాశనం చేస్తారా: కౌశల్

276
kaushal
- Advertisement -

తాను డబ్బు మనిషిని కాదని బిగ్ బాస్ 2 విన్నర్ మందా కౌశల్ స్పష్టం చేశారు. బిగ్‌బాస్‌ 2లో తాను విజేతగా నిలవడంలో కౌశల్ ఆర్మి కీలకపాత్ర పోషించిందని తెలిపిన ఆయన కొంతమంది కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటల్లో నిజానిజాలను తెలుసుకోకుండా కొన్ని టీవీ చానల్స్‌ టీఆర్పీల కోసం తనపై బురదచల్లుతున్నాయని తెలిపారు.

‘బిగ్ బాస్ 2’ నుంచి బయటికి వచ్చాక కనీసం నా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి కూడా వెళ్లలేదని తెలిపిన కౌశల్ అభిమానులకే సమయం కేటాయించానని స్పష్టం చేశారు. ఎవరు ఆహ్వానించినా వెళ్లి కలిశానని తనకు డబ్బుకన్నా అభిమానమే ముఖ్యమన్నారు.

ఒక వైపున సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంటే యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిపోయి టీఆర్పీల కోసం తన జీవితంతో ఆడుకోవడం సరికాదని సూచించారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారి మాటల్లో నిజానిజాలను తెలుసుకోవాలన్నారు.

- Advertisement -