కౌశల్‌కు పవన్‌ ఫ్యాన్స్‌ షాక్‌..చెప్పుతో దాడి..!

258
kaushal army
- Advertisement -

బిగ్‌బాస్‌ 2 విన్నర్‌గా,కౌశల్ ఆర్మీతో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్న నటుడు కౌశల్. బిగ్ బాస్‌ 2 విన్నర్‌గా ఆయన నిలవడంలో కౌశల్ ఆర్మీ కీలకపాత్ర పోషించింది. అయితే ఇప్పుడు అదే ఆర్మీ సభ్యులు తిరగబడటం,కౌశల్‌పై విమర్శలు చేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

హోటల్ లో బుకింగ్ విషయంలో పవన్ కల్యాణ్ పై కౌశల్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కౌశల్ ఆర్మీ సభ్యులు ఆరోపించారు. ఓ టీవీ డిబేట్‌లో ఈ విషయాన్ని వారు చెప్పడంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉగిపోయారు. కర్నూలులో కౌశల్ పోస్టర్‌తో నిరసన ర్యాలీ నిర్వహించిన పవన్ ఫ్యాన్స్‌ ఆయన పోస్టర్‌ని చెప్పుతో కొట్టి వాటిని దగ్దం చేశారు.

తాను పవన్ అభిమానిని అంటూ బిగ్ బాస్ లో ఓట్లు వేయించుకున్న కౌశల్ ఇప్పుడు ఆయన్నే ఎలా విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రజల ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కౌశల్‌ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన పలువురు సైతం ఆయన తీరును తప్పుబడుతున్నారు. కౌశల్‌కి డబ్బు పిచ్చి అని ఆరోపిస్తున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కౌశల్‌ పవన్‌ ఫ్యాన్స్‌కు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచిచూడాలి.

- Advertisement -