కొత్త ఇంట్లోకి వైఎస్ జగన్

246
brother anil
- Advertisement -

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గృహప్రవేశం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఇవాళ ఉదయం సర్వమత ప్రార్థనల మధ్య వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. జగన్‌ గృహప్రవేశానికి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు,నాయకులు హాజరయ్యారు.

గృహప్రవేశం చేసిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు జగన్‌. తన ఇంట్లోనే వైసీపీ కార్యాలయం ఏర్పాటుచేసిన జగన్‌ ఈ సందర్భంగా దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు తరలి రావడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

jagan

వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అధికారికంగా వైసీపలో చేరారు. ఆమంచితో పాటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ కూడా వైసీపీలో చేరారు. వీరిద్దరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్‌.

- Advertisement -