మళ్లీ తెరపైకి పార్లమెంటరీ కార్యదర్శులు..!

204
kcr
- Advertisement -

తెలంగాణలో మరోసారి పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పార్టీలోఉద్యమ కాలం నుండి పనిచేసి,సామాజికవర్గ సమీకరణ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కని వారిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం.

18మంది పార్లమెంట్ కార్యదర్శుల నియామక ప్రక్రియ చేపట్టేలా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు సీనియర్‌ నేతలను నియమించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో కేబినెట్‌ మంత్రులు లేని జిల్లాల్లో పార్లమెంట్ కార్యదర్శుల నియామకం ద్వారా జిల్లాల్లో పాలన ప్రజలకు మరింత చేరువచేసేలా చర్యలు చేపట్టనున్నారు సీఎం. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్‌,జలగం వెంకట్‌రావు,వి శ్రీనివాస్ గౌడ్,గాదరి కిశోర్,వొడితెల సతీష్‌,కోవా లక్ష్మీలను పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించారు. అయితే పార్లమెంట్ కార్యదర్శుల నియామకాన్ని కొట్టేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చేపడితే న్యాయపరమైన చిక్కులు ఉండకుండా అన్నిచర్యలు తీసుకునేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు‌. అన్నిఅనుకున్నట్లు జరిగితే త్వరలోనే పార్టీకి విధేయులుగా పనిచేసిన వారిని పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించనున్నారు గులాబీ బాస్‌.

- Advertisement -