మాండ్య బరిలో సుమలత..!

279
Sumalatha
- Advertisement -

కన్నడ సినీ నటుడు,దివంగత అంబరీష్ భార్య సుమలత రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు రంగం సిద్ధమైంది. భర్త అంబరీష్‌ మరణం తర్వాత ఆయన దారిలోనే పయనించేందుకు ప్రజాసేవ చేస్తానని తెలిపిన సుమలత రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగటం దాదాపు ఖాయమైపోయింది.

అంబరీష్ ప్రాతినిధ్యం వహించిన మాండ్యా నుండి సుమలత పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ లేదా జేడీఎస్‌ నుండి పోటీచేయాలని సుమలతకు ఆహ్వానం అందున్నట్లు టాక్‌. అంబరీష్‌ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించారు.

అంబరీష్‌ మరణం తర్వాత ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సుమలతను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి వస్తున్నట్లు టాక్‌. అంబరీష్ కు మాండ్యా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుండి సుమలతను బరిలో దించడం ద్వారా పార్టీకి లాభిస్తుందని హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సుమలత ఎన్నికల్లో పోటీచేస్తారో లేదో అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కన్నడ సినీ పరిశ్రమలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్‌ మాండ్య గండడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున మాండ్య నుండి ఎమ్మెల్యేగా,ఎంపీగా సేవలందించారు. సిద్దరామయ్య కేబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో సమాచారశాఖ సహాయమంత్రిగా సేవలందించారు.

- Advertisement -