తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పద్మారావు డిప్యూటీ స్పీకర్ అని అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక అనంతరం ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీలో పద్మారావుగౌడ్ 2001లో చేరారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో సనత్నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పద్మారావు గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు పద్మారావు.
తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో ఎక్సైజ్, అబ్కారీ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పద్మారావుగౌడ్ పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరే కంటే ముందు పద్మారావుగౌడ్.. హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.