‘గ్యాంగ్ లీడర్’గా వస్తున్న నాని..

262
NANI 24 Movie
- Advertisement -

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న చిత్రం పేరుని గ్యాంగ్ లీడర్‌గా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. తాజాగా మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్‌లో విడుదల కానుంది. నాని 24వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

NANI 24 Movie

అయితే ఈ మూవీలో నాని నవలా రచయితగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ ఫేమ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం టైటిల్ విషయమై నాని తన ట్విట్టర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ చేశాడు.. ‘గడ్డంతో కూడిన లుక్, చేతుల్లో వెల్డింగ్ గన్.. ఇప్పటికీ గుర్తు. చిన్నారిగా మొదటి రోజు మొదటి షో.. మిగిలినదంతా చరిత్ర. ఒక అభిమాని నాని 24 టైటిల్ ప్రకటిస్తున్నాడు’ అంటూ టైటిల్‌ గురించి వివరిస్తున్న ఓ చిన్న వీడియోను నాని షేర్ చేశాడు.

నాచురల్ స్టార్ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, విఎఫ్ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌ ఫ్లై) కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

- Advertisement -