చంద్రబాబుది చేతకానితనం.. కేటీఆర్‌ చిట్ చాట్..

252
KTR
- Advertisement -

తెలంగాణ శాసనసభ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మాకు 5 స్థానాలు గెలిచే సంఖ్యాబలం ఉందని కేటీఆర్‌ చెప్పారు. శనివారం కేటీఆర్‌ మీడియా నిర్వహించిన చిట్‌ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో షెడ్యూల్‌ ప్రకటిస్తాం.

ఏపీలో వైసీపీ గెలవబోతుంది. అన్నారు కేటీఆర్‌. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో ఉంది ఇక ఇప్పటిలో లేవదు. డిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం అన్నారు. బిజెపి 150 ,కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ,బిజెపికి సంపూర్ణ మెజార్టీ రాదని ఎవరైనా చెబుతారు. అందుకే 16 స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతాం.. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీని డిమాండ్.. కమాండ్ చేయవచ్చు అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR

చంద్రబాబు కలలో కూడా కేసీఆర్‌ను కలవరిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా చంద్రబాబు ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు ది చేతకానితనం. వచ్చే ఎన్నికల్లో బాబు ఒడిపోతాడు. డిల్లీకి కాదు కదా వచ్చే ఎన్నికల్లో విజయవాడలో కూడా చంద్రబాబు గెలవలేడు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఐటి దాడులు జరుగుతున్నాయని మరి చంద్రబాబుకు ఉలిక్కిపాటు ఎందుకు అని కేటీఆర్‌ అన్నారు. చంద్రబాబు లాగా మేము ఖాళీగా లేము మాకు పని ఉంది అన్నారు.

రాజకీయ నాయకుల కంటే మన దేశంలో ప్రజలు తెలివైన వాళ్ళు. చంద్రబాబును అన్యాయం చేసినారు అంటారు. మరోవైపు మేమే నెంబర్ వన్ అంటారు బాబు. గడచిన 5 ఏళ్లలో ఆంధ్రకు వ్యతిరేకంగా మేము ఏమి చేసామో చెప్పాలి. జన్మభూమి కమిటీలు వేసి చంద్రబాబు సాధారణ ప్రజలను వేధించారు. హామీల అమలులో చంద్రబాబు వైఫల్యం చెందారు అని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు. మాకు స్పష్టమైన సంఖ్య ఉంది. అందుకే ఎమ్మెల్సీ 5 స్థానాలకు పోటీ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెడితే మేము తలపడి తప్పకుండా గెలుస్తాం. అని కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -