బర్త్ డే వేడుకలకు దూరం: సీఎం కేసీఆర్

236
kcr terror attack
- Advertisement -

పూల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతం తీవ్రంగా ఖండిస్తోంది. అమరులై జవాన్లకు నివాళులు అర్పిస్తూ బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.

జవాన్లపై ఉగ్రదాడిని దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం…ఈ దాడిలో 42 మంది జవాన్లు మరణించడం,చాలా మందికి తీవ్రగాయాలవడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఉగ్రదాడి తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని తెలిపిన సీఎం ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు.

ఉగ్రదాడి నేపధ్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని జరపొద్దని కేడర్‌కు సూచించారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేడుకలకు బదులు అవయవదానం, రక్తదానం, మొక్కలు నాటాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

- Advertisement -