ప్రేమజంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు

227
Love
- Advertisement -

ప్రేమికుల రోజును జరుపుకోవడం మన సంస్కృతి కాదని, అది విదేశీ సంస్కృతి అని అందుకోసం ప్రేమజంటలు లవర్స్ డే రోజున జంటగా కనిపిస్తే పెళ్లి చేసేస్తాం అని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ సంస్ధలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. నేడు ప్రేమికుల దినం కావడంతో పలు పార్కుల్లో తిరుగుతున్న ప్రేమికులకు పెళ్లిలు చేశారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. మేడ్చల్‌లోని ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఈజంటకు పెళ్లి చేస్తున్న కార్యక్రమాన్ని వీడియో తీశారు. మేడ్చల్‌లో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో ఓ ప్రేమ జంట తిరుగుతుండగా వాళ్లకు బలవంతంగా పెళ్లిచేశారు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు. దాన్ని మొబైల్‌లో వీడియో తీసారు. దాంతో ఆ జంట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు మొదలుపెట్టారు. వాలంటైన్స్ డే రోజు ప్రేమికులు కన్పిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇదివరకే హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రేమికుల దినోత్సవ వేడుకలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు… అబిడ్స్‌లోని జీపీఓ చౌరస్తా దగ్గర ఆందోళనలు చేస్తూ… దిష్టిబొమ్మను తగలబెట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ రోడ్‌లో గల సితార గ్రాండ్‌లో వాలెంటైన్స్‌ డే వేడుకలు జరుగుతున్నట్లు తెలుసుకున్న ఏబీవీపీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాటిని ధ్వంసం చేశారు.

- Advertisement -