సినీ నటుడు బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడును తెరకెక్కించారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కథానాయకుడు బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కథానాయకుడు కొన్నవారికే మహానాయకుడు చిత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ‘కథానాయకుడు’ నష్టాల్లో 33 శాతం భరిస్తానని, ‘మహానాయకుడు’కు వచ్చే ఆదాయంలో 40 శాతం బయ్యర్లకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో ‘మహానాయకుడు’ విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
బాలయ్య భేషైన నిర్ణయం తీసుకున్నారని.. వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే, మా హీరో డేరింగ్‌గా ముందుకొచ్చి సంచలన నిర్ణయం తీసుకున్నాడని నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు.ఇటీవల రీ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకురానుంది.