క్యాస్ట్‌ ఫీలింగ్‌ లేదు..నిహా పెళ్లిపై నాగబాబు క్లారిటీ..!

260
niharika
- Advertisement -

మెగాడాటర్ నిహారిక పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు నాగబాబు. నిహారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పిన ఆయన తనకు కాబోయే అల్లుడు కాపు కులానికి చెందిన వాడై ఉండాలన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన వేరే కులానికి చెందిన మంచి వ్యక్తి కనిపించినా పెళ్లి జరిపించడానికి సిద్ధమని ప్రకటించారు.

త‌న‌కు అంత క్యాస్ట్ ఫీలింగ్ లేదని అన్ని కులాలనూ సమానంగా గౌరవిస్తానని తెలిపారు. నిహారిక‌కు కాబోయే వ‌రుడి విష‌యంలో త‌న‌కు కులంతో సంబంధం లేదని. అత‌ను, త‌న త‌ల్లిదండ్రులు మంచి వాళ్ల‌యితే చాల‌న్నారు.

Image result for niharika
ఆడ పిల్లల్ని సినిమాల్లోకి పంపాలా వ‌ద్దా అని త‌మ కుటుంబంలో చ‌ర్చ జ‌రిగింద‌ని.. ఆ స‌మ‌యంలో నిహారిక‌ గట్టిగా తాను సినిమాల్లో చేస్తానని చెప్ప‌డంతో స‌రే అన్నాన‌ని నాగ‌బాబు చెప్పారు. సినిమాలు కాకుంటే వెబ్ సిరీస్ చేసుకోవ‌చ్చ‌ని నిహాకు సూచించినట్లు చెప్పారు నాగబాబు.

నిహారిక సినిమాల్లో ప్రవేశించినప్పటి నుండి ఆమె పెళ్లి గురించి రకరకాల ఉహాగానాలు వెలువడుతున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో నిహారిక పెళ్లి అంటూ ఒక టైంలో ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత ఒక ద‌శ‌లో ప్ర‌భాస్‌తో నిహారిక పెళ్ల‌న్నారు. కానీ అవన్నీ గాలివార్తలే అని తేలాయి. తాజాగా నాగబాబు నిహారిక పెళ్లిపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -