యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్..

269
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి చివరికల్లా ప్రధాన ఆలయ విస్తరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) ఆ మేరకు ప్రణాళికలతో ముందుకెళ్తోంది.

కొండపై 2.33 ఎకరాల విస్తీర్ణంతో స్వయంభువుల సన్నిధి, మాడ వీధితో కలిపి 4.33 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకార విస్తరణ పనులు జరుగుతున్నాయి. యాదాద్రి అభివృద్ధి పనులను ఈ రోజు (ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామితో చర్చించి మహాకుంభాభిషేకానికి ఓ తేదీని సీఎం ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ రెండోసారి సీఎం అయిన తర్వాత యాదాద్రికి రావడం ఇదే ప్రథమం.

KCR

సీఎం పర్యటన  సందర్భంగా యాదాద్రి చుట్టుపక్కల భద్రతను పెంచారు. సీఎం హెలిప్యాడ్, భద్రతా సిబ్బందికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. బేగంపేట్‌ నుండి బయల్దేరిన సీఎం కేసీఆర్‌ కొద్దిసేపటి క్రితమే యాదాద్రి చుకున్నారు. అక్కడి నుంచి రోడ్ ద్వారా యాదగిరిగుట్ట గుడికి వెళ్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు.

అనంతరం అక్కడే లంచ్ చేసి.. పెద్దగుట్టలో ఉన్న టెంపుల్ సిటీని సందర్శిస్తారు. దాని పనులను పర్యవేక్షిస్తారు. అక్కడి నుంచి మళ్లీ గుడికి వెళ్లి.. గుడి నుంచి హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

- Advertisement -