న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బోల్ట్,గ్రాండ్ హోమ్ ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు సహా వెంటవెంటనే 7 వికెట్లు కోల్పోయాయి.
ఓపెనర్లు ధావన్(13), రోహిత్ (7) శుభ్‌మన్ గిల్(9)ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ డకౌట్‌గా వెనుదిరిగారు. వీరిద్దరినీ గ్రాండ్‌హోమ్ పెవిలియన్‌కు పంపాడు.తర్వాతకేదార్ జాదవ్,భువనేశ్వర్ సైతం పెవిలియన్ బాట పట్టడంతో భారత్ 40 పరుగులకే 7 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్. హార్దిక్ పాండ్య ఉన్నారు. 18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 54/7.కీవిస్ బౌలర్లలో బోల్ట్ 4,గ్రాండ్ హోమ్ 3 వికెట్లు తీశారు.అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ..భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కోహ్లీ,ధోనిలకు భారత్ రెస్ట్ ఇవ్వగా రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.