జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత మూడోసారి జత కడుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. టాలీవుడ్ పరిశ్రమలోని క్రేజీ కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనే గట్టి నమ్మకం , ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఉంది. అందుకే వీరి కలయికలో రాబోతున్న సినిమా పై భారీ స్థాయి అంచనాలున్నాయి.
ఈ సినిమా శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. రెండు నెలల తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక. ఇది కాకుండా పవన్ శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘జిల్లా’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కూడా ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఇక తాజాగా ప్రారంభమైన పవన్-త్రివిక్రమ్ చిత్రానికి ‘దేవుడే దిగివస్తే’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించినంత వరకు పవన్, త్రివిక్రమ్‌లు భారీగా పారితోషికాలు అందుకోనున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకోనున్నాడట. ఇక, త్రివిక్రమ్ కూడా ఈ సినిమా నిర్మాత నుంచి భారీగానే అందుకుంటున్నాడట. దాదాపు 11 కోట్ల రూపాయలు త్రివిక్రమ్ పారితోషికమట.