- Advertisement -
గత ఏడాది మార్చిలో నేపాల్‌లో ఓ విమాన జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదానికి గల కారణాలు తాజాగా వెల్లడయ్యాయి. కాక్‌పిట్‌లో పైలట్ పొగ తాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు విచారణలో తేల్చారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

యూఎస్-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్ యూబీజీ-211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి. నేపాల్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు.
- Advertisement -

