భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన సైనా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించి టైటిల్ నెగ్గింది. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌తో టైటిల్ పోరులో సైనా తలపడింది. అయితే మోకాలి గాయం కారణంగా మారీన్ మధ్యలోనే తప్పుకుంది. మ్యాచ్ ముగియకుండానే సైనా టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది.
ఆట ప్రారంభంలో సైనా అనవసర తప్పిదం చేయడంతో కరోలినా మారిన్ తొలి పాయింట్ సాధించింది. దూకుడుగా ఆడిన మారిన్ తర్వాత రెండు పాయింట్లు సాధించి 0-3తో ఆధిక్యం సాధించింది. కరోలినా తప్పిదంతో సైనాకు తొలి పాయింట్ దక్కింది. సైనా 1-4తో వెనకబడి ఉన్న సమయంలో మారిన్ కాలుకు గాయమైంది.
తీవ్రమైన నొప్పితో కాసేపు ఇబ్బందిపడ్డ కరోలినా కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ రాకెట్ అందుకొని కోర్టులో అడుగుపెట్టింది. తొలి గేమ్‌లో మారిన్ 10-4తో ఆధిక్యంలో ఉండగా గాయం తీవ్రత ఎక్కువ కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా కరోలినా వెనుదిరిగింది. దీంతో సైనాను విజేతగా నిలిచింది.