ప్రేమ, పెళ్లి, రొమాన్స్‌ ….సినిమాతోనే

256
Shraddha Kapoor On Link-Up With Farhan Akhtar
- Advertisement -

శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ లేదట. ఆమె చేతి నిండా సినిమా ఉన్నాయి. అందువల్ల రోజులో 16 గంటల పాటు షూటింగ్‌లకే కేటాయిస్తుందట. మిగిలిన సమయంలోనే విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం చేస్తున్నానని తనే స్వయంగా వెల్లడించింది. ప్రియాంకా చోప్రా లాగే శ్రద్ధా కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా చేస్తున్నట్టు ఉంది.

Shraddha Kapoor On Link-Up With Farhan Akhtar

ప్రస్తుతం ‘ఆషికీ-2’, ‘బాగీ’, ‘ఏబీసీడీ-2’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది శ్రద్ధా కపూర్‌. ప్రస్తుతం ‘రాక్‌ ఆన్‌-2’ చిత్రంతో బిజీగా ఉంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ సహా పలువురు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ద్వారా శ్రద్ధా, ఫర్హాన్‌ మధ్య కొత్తగా ప్రేమ చిగురించిందని వార్తలొచ్చాయి. బీటౌన్‌ మీడియా కూడా దీనిపై బాగానే ప్రచారం చేసింది. ఈ గాసిప్‌ గురించిన వార్త తన చెవిన పడటంతో శ్రద్ధా తాజాగా స్పందించింది.

Shraddha Kapoor On Link-Up With Farhan Akhtar

ప్రేమ, పెళ్లి, రొమాన్స్‌ అన్నీ సినిమాతోనేనని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ఎవరితోనూ ప్రేమలో పడనని శ్రద్ధా గట్టిగానే చెప్పింది.‘ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్ధం కాదు. ఈ పుకార్లు చూసి ఆశ్చర్యపోయాను. మీడియా అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. అనవసరమైన పుకార్లు పుట్టించి వాటినే నిజాలుగా చిత్రీకరించకూడదు. సినిమాల కోసం మా జీవితాల్నే పణంగా పెడతాం. అలాంటిది మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సబబు కాదని సూచించింది. మాకూ కుటుంబాలుంటాయి. ఇలాంటి వార్తలు ప్రచురించడం వల్ల వారు కుంగుబాటుకు గురవుతారు.’ అని శ్రద్ధా వాపోయింది.

Shraddha Kapoor On Link-Up With Farhan Akhtar

- Advertisement -