వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో క్రిష్,కంగనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. అనేక వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..?ప్రేక్షకులకు నచ్చిందా లేదా చూద్దాం..
కథః
బెనారస్‌లోని బితూర్‌లో పుట్టి పెరిగిన మణికర్ణిక (కంగనా రనౌత్)కు ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్ రావు (జిషు సేన్‌గుప్తా)తో వివాహమవుతుంది. ఝాన్సీ రాజ్యానికి వెళ్లాక మణికర్ణికకు లక్ష్మీబాయిగా పేరు మారుస్తారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకునేందుకు బ్రిటీష్ పాలకులు చేసే
ప్రయత్నాలను తిప్పికొడుతుంది. వారితో చర్చలకు నిరాకరిస్తుంది. తర్వాత జరిగిన యుద్ధంలో ఝాన్సీ ఎలాంటి పోరాటపటిమ కనబర్చింది..?ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నదే కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కంగనా రనౌత్,కథనం,దర్శకత్వం. ఝాన్సీ లక్ష్మీబాయిగా కంగనా ఒదిగిపోయింది. తన నట విశ్వరూపం చూపించింది. రణరంగంలో కత్తి దూస్తూ రౌద్ర రూపం దాల్చిన లక్ష్మీబాయిగా మెప్పించింది. లక్ష్మీబాయి భర్త గంగాధర్‌రావు పాత్రలో జిషు సేన్‌గుప్తా, గౌస్‌ఖాన్ పాత్రలో డానీ డెంగోజపా ఇతర నటీనటులు పాత్రలకు నూటికి నూరు శాతం
న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ పాటలు,అనవసరమైన విజువల్ ఎఫెక్ట్స్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. మాటలు బాగున్నాయి. విజువల్‌గా సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రాఫీ ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
వీరనారి ఝూన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం మణికర్ణిక.ఝాన్సీని వశం చేసుకునేందుకు బ్రిటీష్ పాలకులు వేసే ఎత్తులు, యుద్ధం సమయంలో లక్ష్మీబాయి విరోచిత పోరాటం కళ్లకు కట్టినట్లు చూపించారు. కంగనా నటన,కథనం సినిమాకు ప్లస్ కాగా పాటలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా కంగనా రనౌత్ నట విశ్వరూపం ‘మణికర్ణిక..’
విడుదల తేదీ:25/01/2019
రేటింగ్:2.5/9
నటీనటులు: కంగనా రనౌత్, అంకితా లోఖండే
సంగీతం: శంకర్-ఇసాన్-లాయ్
నిర్మాణం: జీ స్టూడియోస్
దర్శకత్వం: క్రిష్ , కంగనా రనౌత్