సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగ పావులు కదుపుతున్న కాంగ్రెస్ ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకను నియమించారు రాహుల్. ఏఐసీసీ పదవితో పాటు ఈస్ట్ యూపీకి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా వ్యవహరించనున్నారు ప్రియాంక.
సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా పోటీకి దిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా సీఎం అభ్యర్థిగా పోటీ పడే ఛాన్సు ఉందని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రియాంకా తనకు రాజకీయాల మీద ఇష్టం లేదని చెప్పారు.
ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. యూపీలో కాంగ్రెస్ కార్యకర్తలకు.. ప్రియాంకాతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాహుల్ కన్నా ఎక్కువగా స్థానిక కార్యకర్తలు ప్రియాంకాతో అతి సన్నితంగా ఉంటారని కొందరంటున్నారు. ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం
చేస్తున్నారు. యూపీ వెస్ట్ భాగంలోని కాంగ్రెస్ విభాగం జనరల్ సెక్రటరీగా జ్యోతిరాధిత్య సింథియాను నియమించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా కేసీ వేణుగోపాల్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.