సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో మహేష్ తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా స్వీట్ లవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు ధన్యవాదాలు. నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికీ, చూపిన ప్రేమకు లవ్ యు’ అని ట్వీట్ చేశారు. నమ్రత ఫెమినా మిస్ ఇండియాగా 1993లో కిరీటం గెలుచుకున్నారు. తర్వాత అనేక సినిమాల్లో నటించారు.
2005, ఫిబ్రవరి 10న మహేష్-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేష్‌తో పెళ్లి తర్వాత ఆమె నటనకు దూరమయ్యారు. మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.