జీవితాంతం బ్రహ్మచారిగా… సుమంత్

257
- Advertisement -

హీరో సుమంత్ ప్రస్తుతం ఒంటిరి అన్న విషయం తెలిసిందే. గతంలో తన సహనటి కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. పెళ్లి తరువాత కీర్తిరెడ్డితో సంవత్సరం పాటు కలిసి ఉన్నాడు ఈ హీరో. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కు వచ్చి వేరైపోయారు. అయితే విడాకుల తరువాత కీర్తిరెడ్డి మరొక వ్యక్తిని పెళ్లాడినా.. సుమంత్ మాత్రం అప్పటి నుంచి తోడు లేకుండానే జీవిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన గోదావరి సినిమా సమయంలో హీరోయిన్‌ కమలిని ముఖర్జీకి సుమంత్ కు మధ్య ఏదో ఉందంటూ వార్తలు వినిపించాయి. కమలీని సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఆ వార్తలు నిజంకాలేదు. ఏజ్ మీద పడుతున్నా.. సుమంత్ పెళ్లి మీద ధ్యాస లేకుండానే కాలం గడిపేస్తున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తరువాత ఈ హీరో ఇప్పుడు నరుడా డోనరుడా మూవీతో మళ్లీ లక్ పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.

Not Planning for Second Marriage: Sumanth

బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్ కు ఇది రీమేక్ వర్షన్. ఈ సినిమాలో సుమంత్ వీర్యదాతగా కనిపిస్తాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ కు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది.ఇంకో పెళ్లి చేసుకుంటారా అంటూ మీడియా వాళ్లు అడిగిడిన ఆ ప్రశ్నకు.. సుమంత్ స్పందిస్తూ.. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, లైఫ్ ఇలానే బాగుందని, ప్రస్తుతానికి పెళ్లి మాత్రం చేసుకోనని చెప్పాడు. అంటే సుమంత్ ఇక జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాడా? అతని మాటలు చూస్తే అలాగే ఉంది మరీ.

- Advertisement -