మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు.. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ. సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా రంగుతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే రంగు కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట. నేషనలైజ్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా ‘సరిహద్దు’.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ ” భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని…ప్రతి భాషకు ఒక “తెగ “అనీ…కొన్ని తెగలకు ఒక “కులం “అనీ.. కొన్ని కులాలు కలసి ఒక “మతం” అనీ విడిపోతూ మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి “తెగలుగా” …తెగలనునుండి..”కులాలుగా”..కులాలనుండి “మతాలుగా”….
మతాలనుండి “రాష్ట్రాలుగా”….రాష్ట్రాలనుంచి “దేశాలుగా”..సరిహద్దుల్ని గీసుకొంటూ…బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది ” అన్నారు.
దర్శకుడు కార్తికేయ, హీరో తనీష్ ‘రంగు’ సినిమాతో అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు. అందుకే మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సారి అంచనాలు కూడా ఉంటాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఓ అద్భుతమైన కథతోనే మళ్లీ వస్తున్నారు ఈ ఇద్దరు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ భాషా నటులు కూడా నటిస్తారు. ప్రస్తుతం టైటిల్ తోనే విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో తెలియజేయబోతున్నారు.