తెలుగువారికీ అమోఘమైన వంటకాలను అందించి యావత్ ప్రపంచ తెలుగు భోజన ప్రియుల మన్ననలు అందుకున్న “ఉలవచారు రెస్టారెంట్” తాజాగా బెంగుళూరు “కోరమంగళ”లో సేవలు అందించాడనికి సన్నద్ధమైనది.ఉలవచారు రెస్టారెంట్ తాజాగా ప్రారంభోత్స వానికి కన్నడ స్టార్ హీరో నిఖిల్ కుమారస్వామి,డిప్యూటీ సీఎం G.పరమేశ్వర,ఎక్స్ హోం మినిస్టర్ రాంలింగా రెడ్డి,TV5 వైస్ చైర్మెన్ సురేంద్రనాధ్,హీరోయిన్ సంజన మరియు మహేష్ రాజ్ కొండూరు తదితరులు విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉలవచారు ఫౌండర్స్ వినయ్ నరహరి, విజయ్ రెడ్డిలు మాట్లాడుతూ.. “ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజల మన్ననలు పొందిన మేము తాజాగా బెంగుళూరులో మా ఉలవచారును ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా ఉలవచారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికి కృతఙతలు తెలియజేస్తునాం. బెంగుళూరులోని తెలుగు,కన్నడ భోజన ప్రియులను సంతోష పెట్టాలనే ఉద్దెశంతో మేము ఈ ఉలవచారును “కోరమంగళ”లో ప్రారంభించడం జరిగింది.
ఉలవచారు బిర్యానీ, రాజుగారికోడి పలావ్, కోనసీమ కోడి వేపుడు, గుత్తివంకాయ్ పలావ్, గద్వాల్ పలావ్, పచ్చిమిర్చి కోడి పలావ్, గోదావరి రొయ్యల వేపుడు వంటి మరెన్నో సొంత రెసిపీలతో జనాదరణ పొందినమేము తాజాగా బెంగుళూరులో మా రెస్టారెంట్ ద్వారా సేవలు అందించదించబోతున్నాము. నేషనల్, ఇంటర్నేషనల్ ఫుడ్ షోస్‌లో అనేక అవార్డులు పొందినమేము కన్నడ ప్రజల అశీసులుపొందుతామని ఆశిస్తున్నాము”అన్నారు.