ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌..ఫించ్ ఔట్

221
india vs australia
- Advertisement -

టీమిండియా-ఆసీస్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ సిడ్నీ వేదికగా ప్రారంభమైంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌ ఆదిలోనే ఆసీస్‌ తొలి వికెట్‌ చేజార్చుకుంది. మూడో ఓవర్లోనే ఆసీస్‌ సారథి ఆరోన్ ఫించ్‌(6) పెవిలియన్ బాటపట్టారు.

స్టార్ స్నిన్నర్ నాథన్ లియాన్, సీనియర్ పేసర్ పీటర్ సిడిల్ చేరికతో ఆ జ‌ట్టు ఒకింత పటిష్ఠంగా ఉంది. ఇక బుమ్రాకి విశ్రాంతి
నివ్వ‌డంతో సిరాజ్ ఈ సిరీస్‌లో ఆడే అవ‌కాశం ద‌క్కిన ఫైన‌ల్ లిస్ట్‌లో మాత్రం ప్లేస్ ద‌క్క‌లేదు. జ‌డేజా, దినేష్ కార్తీక్‌కి చాలా కాలం త‌ర్వాత వ‌న్డేలో ఆడే అవ‌కాశం ద‌క్కింది.

భార‌త జ‌ట్టు : కోహ్లీ ( కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, రాయుడు, దినేష్ కార్తీక్‌, ధోనీ, జడేజా, భువనేశ్వర్ కుమార్‌, కుల్దీప్, ఖలీల్, షమీ.

ఆస్ట్రేలియా: ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, ఖవాజ, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, పీటర్ సిడిల్, రిచర్డ్‌సన్, లియాన్, బెహెన్‌డార్ఫ్.

- Advertisement -