అగ్ర‌వ‌ర్ణాల రిజర్వేష‌న్ పై సుప్రీంకోర్టులో పిటిష‌న్..

200
supremecourt
- Advertisement -

ఈబీసీల‌కు 10శాతం రిజర్వేష‌న్ల బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఇటివ‌లే లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో బిల్ పాసైన విష‌యం తెలిసిందే. ఉభ‌య స‌భ‌ల్లో మెజారిటీ స‌భ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థతోపాటు డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ బిల్లు ద్వారా దేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలూ ఆమోదం తెలిపాయి. ఈబీసీ రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణులు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, రాజ్ పుత్ లు, జాట్స్, మరాఠాలు, భూమిహార్ వంటి సామాజిక వర్గాల పేద ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -