జ‌నాల‌తో కిక్కిరిసిన రైల్వే స్టేష‌న్లు..

825
secundrabad Railway Station Full Rush
- Advertisement -

సంక్రాంతి పండుగ సెల‌వులు కావ‌డంతో పిల్ల‌ల‌ను తీసుకుని ఉర్ల‌కు ప‌య‌న‌మవుతున్నారు జ‌నాలు. దీంతో ప‌లు బ‌స్ స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ లు కిక్కిరిసినిపోతున్నాయి. సంక్రాంతి పండుగ‌ను ప‌రుర‌స్క‌రించుకుని 31 జ‌న‌స‌ద‌ర‌న్ రైళ్ల‌ను న‌డిపించనున్నామ‌ని తెలిపారు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్- తిరుపతి, తిరుపతి- కాకినాడ, విజయవాడ, విజయనగరం వరకు ఈ రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్- విజయవాడ, హైదరాబాద్- సికింద్రాబాద్, విజయవాడల మీదుగా ప్రయాణికులను తమతమ గమ్యస్థానాలకు చేర్చుతాయి.

secundrabad Railway Station Full Rush

ఈ రైళ్లలో అన్‌రిజర్వుడ్ కోచ్‌లు కూడా ఉంటాయని, ప్రత్యేక రుసుములు చెల్లించకుండా సాధారణ టికెట్ల రేట్లతోనే ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.30 గంటలకు ఈ నెల 11, 12, 13, 15, 16, 17, 18, 19 తేదీల్లో బయలుదేరి ఉదయం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి. నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయి.

విజయవాడ నుంచి తిరిగి సికింద్రాబాద్‌కు ఈనెల 12, 13, 14, 16, 17, 18, 19, 20 తేదీల్లో నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మ‌రో వైపు బ‌స్ స్టేషన్ లు కూడా జ‌నాల‌తో కిక్కిరిసిపోయాయి. హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ , న‌ల్ల‌గొండ‌, విజ‌యవాడ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, క‌రీంన‌గ‌ర్ కు ప‌లు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు అధికారులు.

- Advertisement -