విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్యాథ‌రిన్..

257
Vijay Devarakonda, Catherine

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటివ‌లే ట్యాక్సీవాల సినిమాతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ మూవీలో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్న ఈమూవీకి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విజ‌య్ స‌ర‌స‌న ర‌ష్మీక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈమూవీ త‌ర్వాత విజ‌య్ క్రాంతి మాధవ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ స్ర్కీప్ట్ ప‌నిలో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంద‌ని స‌మాచారం.

viajy Director Kranthi Madhav
ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు క్రాంతి మాధ‌వ్. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమాను నిర్మాత కేఎస్ రామారావు నిర్మించ‌నున్నారు. ఈసినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్ల‌ను ప‌రిశీలించారు.

dear comrade
తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం కేథ‌రిన్ ను తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఆమె తెలుగులో చివ‌ర‌గా స‌రైనోడు, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో న‌టించింది. క్రాంతిమాధవ్ మూవీలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. వ‌చ్చే నెల నుంచి ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంద‌ని స‌మాచారం.