ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిగా స్టిఫెన్ సన్..

295
Stephenson
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ ఎస్కే జోషి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా స్టిఫెన్‌సన్‌ను నియమించాలని నిర్ణయించారు. స్టిఫెన్‌సన్‌ను నియమిస్తూ మంత్రివర్గం గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపాదన పంపింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు, ప్రభుత్వ యంత్రంగానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని నిర్ణయించింది మంత్రివర్గం. సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులు, నిబంధన పుస్తకాలు, బుక్‌లెట్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -