టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు.
ముందస్తు పెళ్లి వేడుక నుంచి చివరి ఘట్టం వరకు తారక్, ప్రభాస్, చరణ్, రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి రచ్చ చేశారు. ఇదిలావుండగా, నిన్న పెళ్లి వేడుకకు ముందు పూజా ప్రసాద్ కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్ కూడా మోస్తూ వివాహ మండపానికి తీసుకు వచ్చారు. ప్రభాస్ పల్లకిని మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Darling #Prabhas at #SSKWedding #PrabhasAtSSKWedding pic.twitter.com/VIYEiNcLYl
— Prabhas™ (@Prabhas_Team) December 30, 2018