బీసీల‌కు అధిక ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నాంః సీఎం కేసీఆర్

248
kcr
- Advertisement -

దేశంలో బీసీల‌కు న్యాయం చేస్తున్న ఎకైక ప్ర‌భుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప‌లు పార్టీల నేత‌లు ప్ర‌భుత్వం పై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే వాళ్ల‌కు బుద్ది చెప్పారు. బీజేపీ మొత్తం 108స్ధానాల్లో పోటీ చేస్తే 103 స్దానాల్లో డిపాజిట్ కూడా రాలేదు. బీసీల మీద చాలా పార్టీలు ప్రేమ ఒల‌క‌బోస్తున్నాయి. తెలంగాణ లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం రాక‌ముందు రాష్ట్రంలో మొత్తం 19 గురుకుల పాఠ‌శాలలు ఉన్నాయ‌ని.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక 261 స్కూళ్ల‌ను క‌ట్టించాం. గ‌తంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు బీసీల‌కు అన్యాయం చేశాయ‌న్నారు. బీసీల మీద ప్రేమ ఎవ‌రికి ఉందో ప్ర‌జ‌ల‌కు తెలుసన్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే మేము గ్రామ పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలని మేయు చట్టం కూడా తెచ్చాం. దీని మీద కూడా కాంగ్రెస్ స‌ర్పంచ్ లు స్వ‌ప్నా రెడ్డి, భూపాల్ రెడ్డి రిజ‌ర్వేష‌న్ 50శాతానికి మించ‌వ‌ద్ద‌ని కోర్టుకు వెళ్లారు.వంద రోజుల్లో గ్రామపంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలని హైకోర్టు ఆదేశించింది.సీఎం త‌ర్వాత ప్రొటొకాల్ ఉండే రెండు ప‌ద‌వులు బీసీల‌కు ఇచ్చిన ఘ‌న‌త టీఆర్ఎస్ పార్టీది. శాస‌న‌స‌భ స్పీక‌ర్, శాస‌న మండ‌లి స్పీక‌ర్ రెండు ప‌ద‌వులు బీసీల‌కే ఇచ్చామ‌న్నారు. 50మంది బీసీల‌కు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వులు ఇచ్చినం. చ‌ట్ట స‌భ‌ల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినం అని చెప్పారు.

హైద‌రాబాద్ లో అన్ని కులాల వారికి ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు నిర్మిస్తున్నాం. బీసీల‌కు ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఉండాల‌ని కేంద్రాన్నీ ఎన్నో సార్ల కోరినం. స్వ‌య‌నా నేనే వెళ్లి అడిగాన‌.. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్ప‌టినుంచి ఇప్పుడున్న మోదీ వ‌ర‌కూ చాలా సార్లు వాళ్ల‌ను అడిగా ప‌ట్టించుకోలేదన్నారు. చంద్ర‌బాబు ప‌చ్చి అబ‌ద్దాల కోరు అన్నారు. చంద్ర‌బాబు అంత నీచ రాజ‌కీయాలు దేశంలో ఎవ‌రూ చేయ‌రన్నారు. డిసెంబ‌ర్ లోపే హైకోర్టు నిర్మించుకుంట‌మ‌ని చంద్ర‌బాబే లెట‌ర్ రాశారు.

చంద్ర‌బాబును భ‌రిస్తున్న ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానని చెప్పారు. హోదాతో ఏం జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబే చెప్పారు. యూజ్ అండ్ త్రో లో నెంబ‌ర్ వ‌న్ వ్య‌క్తి చంద్ర‌బాబు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్ లో చెప్పారు. తెలంగాణ‌లో ఉన్న ప‌థ‌కాల‌న్ని కాపీ కొట్టి ఆంధ్రాలో ప్ర‌వేశ‌పెట్టినారు. క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని మ‌నం పెట్టినాక ఆంధ్రాలో పెట్టినారు. 9ఏండ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌డు ఇలాంటి ప‌థ‌కాలు ఎందుకు ప్ర‌వేశ పెట్ట‌లే అని ప్ర‌శ్నించారు.

- Advertisement -