పూరి జగన్నాధ్ తన కొత్త సినిమాకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సినిమాకు సినిమాకు మధ్య ఎప్పుడూ నెలకంటే ఎక్కువగా గ్యాప్ తీసుకొని పూరి మొదటి సారి చాలా గ్యాప్ తీసుకొని తన నెక్స్ట్ సినిమాను ఎనర్జిటిక్ హీరో రామతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక యూత్‌లో రామ్‌కి మంచి క్రేజ్ వుంది .. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మంచి కథకోసం వెయిట్ చేస్తూ గ్యాప్ తీసుకున్న రామ్, పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తాజాగా ఈ సినిమాను గురించి రామ్ ప్రస్తావించాడు. ‘నన్ను మంచివాడిగా చూసి బోర్ కొట్టిందా .. అయితే ఇప్పుడు చెడ్డవాడిగా చూడండి’ అంటూ పూరి .. ఛార్మితో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమా బోల్డ్ కంటెంట్‌తో రూపొందనున్నట్టు రామ్ చెప్పాడు. ఈ సినిమాలో రామ్ కొత్తలుక్‌తో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీని పూరి తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే కథానాయికలు ఎవరనే విషయాన్ని వెల్లడించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేయనున్నారట.. మరి ఈ మూవీ వీరిద్దికి ఎలాంటి విజయాన్నా అందిస్తోందో చూడాలి.
When you’re bored playing the good guy…you meet this Bad Boy!! Finally!#RaPo17 with one of my all time fav @purijagan garu! Kicked about this BOLD WILD FILM! #Love -R.A.P.O pic.twitter.com/ZPe7LrT6FD
— RAm POthineni (@ramsayz) December 26, 2018