బుల్‌ బుల్‌ బాలయ్యని వదలని నాగబాబు

236
balakrishna
- Advertisement -

నందమూరి బాలకృష్ణపై మరోసారి సెటైర్ వేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ హాట్ కామెంట్స్ చేసిన నాగబాబు అప్పటినుండి సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై మళ్లీ సెటైర్ వేశారు.

ఓ బాలుడు చక్కగా.. ఏ మాత్రం తడబడకుండా దేశ భక్తి గీతం సారే జహాసే.. అచ్చాను పాడిన వీడియోను తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పంచుకున్నారు. నాగబాబు ఏ ఉద్దేశంతో పోస్ట్‌ చేసినప్పటికీ.. మెగా అభిమానులు మాత్రం బాలయ్యకు కౌంటర్‌గానే అని భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో బాలయ్య పాడిన పాటతో నవ్వులపాలయ్యారు.

తాజా వీడియో ఈ వివాదానికి మరింత అగ్గిని రాజేసింది. ఈ కామెంట్స్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా మెగా, నందమూరి అభిమానుల వార్‌ నడుస్తోంది.

- Advertisement -