ఉత్తమ నటుడు ఎన్టీఆరే-ప్రభాస్‌

251
Prabhas
- Advertisement -

టాలీవుడ్‌లో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల సంఖ్య పెరిగింది. టాలీవుడ్లోని ఇతర కథానాయకులతో ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అలాంటి ప్రభాస్‌ను ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో కరణ్ జొహార్ ఒక ప్రశ్న అడిగారు.

Prabhas

టాలీవుడ్ లోని మిగతా హీరోల్లో ఉత్తమ నటుడిగా వీరిలో ఎవరిని భావిస్తావు?” అంటూ ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ పేర్లను కరణ్ వరుసగా చెప్పారు. దానికి ప్రభాస్‌ బదులిస్తూ..త‌ను క‌లిసి న‌టించాల‌నుకునే హీరోల్లో ఎన్టీఆర్ నెంబ‌ర్ వ‌న్ అని చెప్పాడు. అలాగే మ‌హేష్‌కు రెండో ర్యాంకు ఇచ్చాడు. త‌ర్వాత బ‌న్నీ, చెర్రీ పేర్ల‌ను చెప్పాడు.

ఇక‌, హీరోయిన్ల‌లో అనుష్క న‌ట‌న అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని అన్నాడు. అలాగే త‌మ గురించి వినిపిస్తున్న రూమ‌ర్ల‌ను కొట్టిపారేశాడు. అనుష్క మంచి స్నేహితురాలు మాత్ర‌మేన‌ని, అంత‌కు మించి ఇంకేమీ లేద‌ని చెప్పాడు.

- Advertisement -