‘దటీజ్ మహాలక్ష్మి’ టీజర్..

240
That Is Mahalakshmi Movie
- Advertisement -

బాలీవుడ్‌లో భారీ విజయం అందుకున్న సినిమా ‘క్వీన్’. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం నాలుగు భాషలలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం దటీజ్ మహాలక్ష్మి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అ’ చిత్ర ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

That Is Mahalakshmi Movie

‘మై సెల్ఫ్ మహాలక్ష్మి..నేను నా హనీమూన్‌కు వచ్చా’ అంటూ వచ్చే డైలాగ్స్‌తో ప్రారంభమయ్యే టీజర్ ఆకట్టుకుంటోంది..రాజమండ్రి దగ్గరలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఫ్రాన్స్ వెళ్లిన మహాలక్ష్మికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మహాలక్ష్మి అమాయకత్వం .. రాజమండ్రిపై ఆమెకి గల ప్రేమ .. విదేశీ సంస్కృతిలో ఇమడటానికి ఆమె పడిన ఇబ్బందులనే ఈ టీజర్‌లో చూపించారు.

హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. కన్న‌డ, త‌మిళ వర్షన్లకు రమేష్ అరవింద్, మ‌ల‌యాళ సినిమాకు నీల‌కంఠ‌ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -