శర్వానంద్-సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’.ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ జోడి ఇవాళ ప్రేక్షకుల ముందు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకువచ్చారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా చూద్దాం…
కథ:
తను ప్రేమించిన అమ్మాయికి దూరమైన సూర్య(శర్వానంద్) తన ప్రేమకథను చెప్పటం ప్రారంభిస్తాడు. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడతారు అయితే తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దని అంటాడు సూర్య. దీంతో ఇద్దరు విడిపోతారు. అసలు సూర్య గతం ఏంటీ..? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ..?చివరకు కలిశారా లేదా అన్నదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మ్యూజిక్,శర్వా, సాయి పల్లవి నటన.తనదైన నటనతో ఆకట్టుకున్నాడు శర్వానంద్. కామెడీ,రొమాంటిక్ సీన్స్‌లో పర్ఫెక్ట్ టైమింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. వైశాలి పాత్రలో జీవించింది సాయి పల్లవి. ఇద్దరి పెయిర్ వెండితెరపై అద్భుతంగా ఉంది. అంతేగాదు తమదైన నటనతో సినిమా స్ధాయిని పెంచేశారు. మిగితా నటీనటుల్లో ప్రియదర్శి, సునీల్, వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్,స్లో నరేషన్. ఇంటర్వెల్ సీన్ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. రొటీన్ సీన్స్ తో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సినిమాను సంగీతం మరోస్ధాయికి తీసుకెళ్లింది. విశాల్ చంద్రశేఖర్ తన సంగీతంతో మ్యాజిక్ చేశాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సూపర్బ్. సినిమాటోగ్రఫి,ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
లవ్ స్టోరీ కి డిఫరెంట్ కాన్సెప్ట్ ను జోడించి హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం పడి పడి లేచె మనసు. శర్వా ,సాయి
పల్లవి ల నటన సినిమాకు హైలైట్ అవ్వగా సెకండ్ హాఫ్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా యూత్‌కి నచ్చే మూవీ పడి పడి లేచె మనసు.
విడుదల తేదీ:21/12/18
రేటింగ్:2.75/5
నటీనటులు : శర్వానంద్, సాయి పల్లవి
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాత : ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : హను రాఘవపూడి