ఉద్య‌మానికి ప‌ర్యాయ‌ప‌దం ఓరుగ‌ల్లుః కేటీఆర్

326
ktr
- Advertisement -

తెలంగాణ ఉద్య‌మానికి ప‌ర్యాయ‌ప‌దం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా అన్నారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లో కాక‌తీయ డిగ్రీ క‌ళాశాలలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆశీర్వాద సభకు హాజ‌ర‌య్యారు కేటీఆర్. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పార్టీని గ్రామ‌స్ధాయి నుంచి బ‌లోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నాకు ఈఅవ‌కాశం కల్పించార‌న్నారు . మొద‌ట‌గా ఈయాత్ర‌ను ఎక్క‌డ‌నుంచి ప్రారంభించాల‌ని అడిగిన‌పుడు ఉద్య‌మాల జిల్లా వ‌రంగ‌ల్ నుంచి ప్రారంభించ‌మ‌ని నాకు ఆయ‌న చెప్పార‌న్నారు.

ktr road show warangal

నేను నాజీవితంలో ఓకే సారి జైలుకు వెళ్లాన‌ని అది కూడా తెలంగాణ ఉద్య‌మంలో వరంగ‌ల్ స‌బ్ జైల్లో ఒక‌రోజు గ‌డిపాన‌న్నారు. ఈవిష‌యాలు నాజీవితంలో మ‌ర్చిపోన‌ని చెప్పారు. ఉద్య‌మం స‌మ‌యంలో త‌న‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న స‌మ‌యంలో హ‌న్మ‌కొండ చౌర‌స్తాలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ ఇంట్లో వెళ్లి కూర్చున్నామ‌ని పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి మ‌మ్మల్లీ అరెస్ట్ చేశార‌న్నారు.

దేశంలో మొత్తంలో రైతుల‌కు రైతు బంధు ప‌థ‌కం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాబోయే ఆరునెల‌ల్లో ప్ర‌తి జిల్లాలో పార్టీ ఆఫీసులు నిర్మిస్తామ‌ని చెప్పారు. పార్టీ ఆఫీసుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇత‌ర నాయ‌కులు రోజు కొంత స‌మ‌యం కేటాయించాల‌ని సూచించారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

నాడు ఉద్యమసమయంలో వరంగల్ ప్రజలు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. నాటి నుండి నేటి వరకు టీఆర్ఎస్‌కు ఆయువుపట్టుగా ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామన్నారు. ఎత్తిన గులాబీ జెండా దించకుండా పోరాడిన కార్యకర్తలకు అండగా నిలబడటమే తనముందున్న లక్ష్యం అన్నారు. పంచాయతీ ఎన్నికలు,మున్సిపాలిటీ,పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.

- Advertisement -